Share News

IPL 2025, KKR vs GT: టాప్ టీమ్‌ను కొట్టగలరా.. కేకేఆర్‌కు అసలు సిసలు పరీక్ష

ABN , Publish Date - Apr 21 , 2025 | 05:08 PM

ఐపీఎల్ చరిత్రలో అంత తక్కువ స్కోరును ఛేజింగ్ చేయలేక ఓడిపోయిన తొలి జట్టు కోల్‌కతానే కావడం గమనార్హం. ఆ దారుణ పరాజయం నుంచి కోలుకుని మళ్లీ విజయాల బాట పట్టడం కేకేఆర్‌కు సవాలే. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్ టీమ్ తలపడబోతోంది.

IPL 2025, KKR vs GT: టాప్ టీమ్‌ను కొట్టగలరా.. కేకేఆర్‌కు అసలు సిసలు పరీక్ష
KKR vs GT

కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ (IPL 2025) చరిత్రలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడింది. ఐపీఎల్ చరిత్రలో అంత తక్కువ స్కోరును ఛేజింగ్ చేయలేక ఓడిపోయిన తొలి జట్టు కోల్‌కతానే (KKR) కావడం గమనార్హం. ఆ దారుణ పరాజయం నుంచి కోలుకుని మళ్లీ విజయాల బాట పట్టడం కేకేఆర్‌కు సవాలే. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో కేకేఆర్ టీమ్ తలపడబోతోంది (KKR vs GT). వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది.


ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు కోల్‌కతా, గుజరాత్ టీమ్‌లు నాలుగు సార్లు తలపడ్డాయి. వాటిల్లో గుజరాత్ రెండు సార్లు గెలవగా, కోల్‌కతా ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఈడెన్ గార్డెన్స్‌లో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది.


ఇక, కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం అనే సంగతి తెలిసిందే. హై స్కోరింగ్ మ్యాచ్‌లకు అవకాశం ఎక్కువ. ఈ పిచ్‌పై ఛేజింగ్ కంటే మొదటి బ్యాటింగ్ చేయడం ఉత్తమం. మరి, గత మ్యాచ్‌లో పరాజయాన్ని మరిచిపోయి స్వంత గడ్డపై కేకేఆర్ బౌన్స్ బ్యాక్ అవగలదో లేదో చూడాలి. ఇక, గత మ్యాచ్‌లో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా ఛేదించిన గుజరాత్‌ను నిలువరించాలంటే కేకేఆర్ చెమటోడ్చాల్సిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 05:08 PM