Share News

IPL 2025: సాల్ట్, కోహ్లీ వీర విహారం.. పది ఓవర్లకు బెంగళూరు స్కోరు ఎంతంటే..

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:18 PM

కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు సునాయస విజయం సాధించేలా కనిపిస్తోంది.

IPL 2025: సాల్ట్, కోహ్లీ వీర విహారం.. పది ఓవర్లకు బెంగళూరు స్కోరు ఎంతంటే..
Phil Salt, Virat Kohli

కోల్‌కతా (Kolkakta)లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఈ సీజన్ (IPL 2025) తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు సునాయస విజయం సాధించేలా కనిపిస్తోంది. ఓపెనర్ సాల్ట్ (31 బంతుల్లో 56) వేగవంతమైన అర్ధశతకం చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అవుట్యాడు. కోహ్లీ (24 బంతుల్లో 39) వేగంగా ఆడుతున్నాడు. వార్‌ను వన్ సైడ్ చేసేశారు. ప్రస్తుతం కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కళ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 104 పరుగులు చేసింది (KKR vs RCB). విజయానికి 60 బంతుల్లో ఇంకా 71 పరుగులు అవసరం.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ రహానే (56), నరైన్ (44) సిక్స్‌లతో హోరెత్తించారు. ఆరంభంలో బెంగళూరు బౌలర్లు కట్టుదట్టింగా బౌలింగ్ చేసి ఓపెనర్ డికాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే రహానే వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రహానే 4 సిక్స్‌లు, నరైన్ 3 సిక్స్‌లు కొట్టారు. అయితే వీరు అవుట్ అయిన తర్వాత బెంగళూరు మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. వెంట వెంటనే వికెట్లు తీశాడు. రఘువంశీ (30) మాత్రమే రాణించాడు.


ముఖ్యంగా బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా (3) తెలివిగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. హాజెల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. శర్మ, దార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 175 పరుగులు లక్ష్యం ఉంచింది. కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి..


IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే


IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2025 | 10:20 PM