IPL 2025, KKR vs RR: తడబడిన రాజస్తాన్ బ్యాటర్లు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:16 PM
కోల్‌కతా స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. స్లో పిచ్‌పై వేగంగా ఆడలేక తడబడ్డారు. కోల్‌కత్ నైట్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

కోల్‌కతా స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. స్లో పిచ్‌పై వేగంగా ఆడలేక తడబడ్డారు. గౌహతిలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. సీనియర్ ఆటగాడు అజింక్య రహానే కోల్‌కతాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. రియాన్ పరాగ్ రాజస్తాన్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. కోల్‌కత్ నైట్‌రైజర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (33) టాప్ స్కోరర్.
కోల్‌కతా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (2/17), మొయిన్ అలీ (2/23), వైభవ్ అరోరా (2/33) రాణించడంతో రాజస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. మంచి ఆరంభాన్ని రాజస్తాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (29) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రియాన్ పరాగ్ (25) కూడా మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక, చివర్లో ధ్రువ్ జురెల్ కాస్తా పోరాడాడు. సంజూ శాంసన్ (13), నితీష్ రాణా (8), హసరంగ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చకవ్రర్తి, వైభవ్ అరోరా, మొయిన్ అలీ, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు.
గౌహతీలోని స్లో పిచ్‌పై స్పిన్నర్లు సత్తా చాటారు. రాజస్తాన్ హిట్టర్లు కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. అయితే రెండో బ్యాటింగ్ సమయంలో మంచు కురుస్తుంది కాబట్టి స్పిన్నర్లకు టర్న్ లభించడం కష్టం. మొదటి బ్యాటింగ్‌తో పోల్చుకుంటే రెండోసారి బ్యాటింగ్ చేయడం ఈ పిచ్‌పై సులభం. ఈ నేపథ్యంలో కోల్‌కతా బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..