IPL 2025, KKR vs RR: టాస్ గెలిచిన కోల్‌కతా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Mar 26 , 2025 | 07:08 PM
తమ తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోయిన రెండు జట్లు గెలుపు రుచి కోసం తహతహలాడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగుతున్న రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గౌహతిలో ఈ మ్యాచ్ జరగబోతోంది.

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తమ తమ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోయిన రెండు జట్లు గెలుపు రుచి కోసం తహతహలాడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగుతున్న రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గౌహతిలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానే కోల్‌కతాకు కెప్టెన్సీ చేస్తున్నాడు. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్తాన్ మొదటి బ్యాటింగ్ చేయబోతోంది.
తుది జట్లు:
రాజస్తాన్ రాయల్స్: సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హిట్‌మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
కోల్‌కతా నైట్ రైడర్స్: డికాక్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, జాన్సన్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
ఇవి కూడా చదవండి..
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..