Share News

IPL 2025, LSG vs DC: లఖ్‌నవూ రివేంజ్ తీర్చుకుంటుందా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:44 PM

ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తలపడబోతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని ఎల్‌ఎస్‌జీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IPL 2025, LSG vs DC: లఖ్‌నవూ రివేంజ్ తీర్చుకుంటుందా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
DC vs LSG

ఐపీఎల్‌లో (IPL 2025) రీవేంజ్ వీక్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అన్ని టీమ్స్ రెండో రౌండ్ ఆడబోతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 22) లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ (LSG vs DC) తలపడబోతోంది. రిషభ్ పంత్ (Rishabh Pant) సారథ్యంలోని ఎల్‌ఎస్‌జీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు అక్షర్ పటేల్ (Axar Patel) నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.


ఐపీఎల్‌లో లఖ్‌నవూ, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడాయి. మూడేసి విజయాలతో సమానంగా ఉన్నాయి. అయితే 2024 సీజన్ నుంచి ఢిల్లీ, లఖ్‌నవూ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగితే మూడింట్లోనూ ఢిల్లీనే విజేతగా నిలిచింది. గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లు, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఢిల్లీ వశమయ్యాయి. మరి, ఈ రోజు లఖ్‌నవూ ప్రతికారం తీర్చుకుంటుందేమో చూడాలి. ఇక, ఢిల్లీ టీమ్ సమష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా కరణ్ నాయర్, కేఎల్ రాహుల్ స్థిరంగా రాణిస్తున్నారు. మిడిలార్డర్‌లో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకుంటున్నారు.


బ్యాటింగ్‌తో పోల్చుకుంటే ఢిల్లీ టీమ్ బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ చక్కగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు లఖ్‌నవూ టీమ్ పూర్తిగా టాపార్డర్ పైనే ఆధారపడుతోంది. మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ రాణిస్తేనే లఖ్‌నవూ టీమ్ భారీ స్కోరు సాధిస్తోంది. రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో దిగ్వేశ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ ప్రభావవంతంగా రాణిస్తున్నారు.


తుది జట్లు:

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్

ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2025 | 05:44 PM