IPL 2025 MI vs SRH: బుమ్రా 300 వికెట్లు.. రోహిత్ శర్మ 12 వేల పరుగులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 10:31 PM
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తమ కెరీర్లో అరుదైన మైలు రాళ్లను చేరుకున్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (SRH vs MI) ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తమ కెరీర్లో అరుదైన మైలు రాళ్లను చేరుకున్నారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఇది బుమ్రాకు 300వ టీ-20 వికెట్. అంతర్జాతీయ టీ-20 క్రికెట్, ఐపీఎల్‌లో కలిపి ఇప్పటికి బుమ్రా 300 వికెట్లు దక్కించుకున్నాడు (IPL 2025).
ఇదే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 వేల టీ-20 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రహిత్ ఈ ఘనతను చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ-20 క్రికెట్, ఐపీఎల్‌లో కలిపి ఇప్పటికి రోహిత్ 12 వేల పైచిలుకు పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌లో వరుసగా రెండో అర్ధశతకం సాధించిన రోహిత్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..