Share News

IPL 2025, RCB vs GT: తడబడిన బెంగళూరు.. గుజరాత్‌ టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - Apr 02 , 2025 | 09:17 PM

గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. షాట్ సెలక్షన్‌లో లోపం కారణంగా బెంగళూరు బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. దీంతో 169 పరుగుల స్కోరుకే ఆర్సీబీ పరిమితమైంది.

IPL 2025, RCB vs GT: తడబడిన బెంగళూరు.. గుజరాత్‌ టార్గెట్ ఎంతంటే
Mohammed Siraj

మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్వంత మైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో తడబడింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. షాట్ సెలక్షన్‌లో లోపం కారణంగా బెంగళూరు బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. అయితే లివింగ్‌స్టన్ సమయోచితంగా ఆడి హాఫ్ సెంచరీ చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.


రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (7) డీప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ వెంట వెంటనే దవ్‌దత్ పడిక్కళ్ (4), సాల్ట్ (14) వికెట్లు పడగొట్టాడు. రెండు ఫోర్లు కొట్టిజోరు మీద కనిపించిన కెప్టెన్ రజిత్ పటీదార్ (12)ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ దశలో లివింగ్ స్టన్ (54), జితేష్ శర్మ (33) వికెట్ల పతనాన్ని అడ్డకుంటూ పరుగులు చేశారు. ఈ జోడీని సాయికిషోర్ విడదీశాడు.


జితేష్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి సాయి కిషోర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ వెంటనే కృనాల్ పాండ్యా కూడా సాయి కిషోర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. చివర్లో టిమ్ డేవిడ్ (32) కీలక పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు తీశాడు. అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 09:17 PM