IPL 2025, RCB vs PBKS: పంజాబ్‌దే మ్యాచ్.. స్వంత గడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:17 AM
స్వంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
స్వంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) జట్లు ఈ రోజు (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ బౌలర్లు అందరూ రాణించారు. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్ (50 నాటౌట్), కెప్టెన్ రజత్ పటీదార్ (23) తప్ప మిగిలిన బ్యాటర్లు ఎవరూ పది పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, ఛాహల్, బ్రార్, జాన్సన్‌కు రెండేసి వికెట్లు తీసుకున్నారు. జేవియర్ ఒక్క వికెట్ తీశాడు.
96 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కూడా ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయింది. హాజెల్ వుడ్ (3/14) రాణించడంతో పంజాబ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (13), ప్రియాంశ్ (16), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), జాస్ ఇంగ్లీష్ (14) త్వరగానే అవుటయ్యారు. అయితే, లక్ష్యం తక్కువగా ఉండడంతో నేహల్ వధేరా (33) సమయోచితంగా రాణించి పంజాబ్‌కు విజయం అందించాడు. దీంతో పంజాబ్ 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇది పంజాబ్‌కు ఈ సీజన్‌లో ఇది ఐదో విజయం. ఆర్సీబీకి మూడో పరాజయం.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..