IPL 2025, RR vs LSG: సంజూ శాంసన్ రెడీనా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - Apr 19 , 2025 | 05:55 PM
వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్‌కు ఆందళన కలిగించే మరో అంశం ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సంజూ శాంసన్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దాంతో అతడు ఆట మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్ (RR)కు ఆందోళన కలిగించే మరో అంశం ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సంజూ శాంసన్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దాంతో అతడు ఆట మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG vs RR) జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) అందుబాటులో ఉండేది, లేనిది ప్రశ్నార్థకంగా మారింది (IPL 2025).
మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకుని విజయాల బాట పట్టాలని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ కృత నిశ్చయంతో ఉంది. పాయింట్ల పట్టికలో లఖ్‌నవూ టీమ్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండగా, రాజస్తాన్ రాయల్స్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. లఖ్‌నవూకు టాపార్డర్ బ్యాటర్లు అయిన మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్ అత్యంత కీలక ఆటగాళ్లు. గత మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ ఫామ్‌లోకి రావడం కొంత సానుకూలాంశం. చివర్లో డేవిడ్ మిల్లర్ కీలక పరుగులు చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌తో పోల్చుకుంటే లఖ్‌నవూ బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది.
మరోవైపు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌తో కూడిన రాజస్తాన్ బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనబడుతోంది. అయితే లఖ్‌నవూ తరహాలోనే రాజస్తాన్ కూడా బౌలింగ్‌లోనే తడబడుతోంది. జోఫ్రా ఆర్చర్ మినహా మిగతా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్
రాజస్తాన్ రాయల్స్ (అంచనా): యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్‌మేయర్, హసరంగ, ఆర్చర్, కార్తికేయ, ఆకాశ్, సందీప్ శర్మ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..