Share News

IPL 2025, SRH vs LSG: టాస్ గెలిచిన లఖ్‌నవూ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Mar 27 , 2025 | 07:14 PM

తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడబోతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ టీమ్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అత్యంత బలంగా కనబడుతోంది.

IPL 2025, SRH vs LSG: టాస్ గెలిచిన లఖ్‌నవూ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
SRH vs LSG

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెండు బలమైన జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తలపడబోతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.


ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ టీమ్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అత్యంత బలంగా కనబడుతోంది. మరోవైపు బ్యాటింగ్‌లో బలంగా కనబడుతున్న లఖ్‌నవూ బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా కనబడుతోంది. ఇక, తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ మొదటి బ్యాటింగ్ చేయబోతోంది.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, సిమర్‌జీత్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: ఐదెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోనీ, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్

Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు


Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 07:14 PM