IPL 2025 SRH VS MI: మళ్లీ తడబడిన సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:12 PM
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ తన తడబాటును కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీమ్‌తో (SRH vs MI) జరిగినమ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ తన తడబాటును కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ టీమ్‌తో (SRH vs MI) జరిగినమ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. (IPL 2025).
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (0) అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషన్ (1) బంతి బ్యాట్‌కు తగిలిందనుకుని తనకు తానుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తగల్లేదని తేలింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (8) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లలో ఒక్కరూ కూడా పది పరుగులు చేయలేకపోయారు.
టాపార్డర్ విఫలమైనా హెన్రిచ్ క్లాసెన్ (71) అర్ధశతకంతో ఆదుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోలుకుంది. అతడికి అభినవ్ మనోహర్ (43) సహకరించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ ఛాహర్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ టార్గెట్‌ను హైదరాబాద్ బౌలర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..