Jasprit Bumrah : బుమ్రాకు వెన్నునొప్పి
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:11 AM
బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. లంచ్ తర్వాత ఒక్క ఓవర్ మాత్రమే వేసిన అతడు అర్ధంతరంగా మైదానం వీడాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకొన్నాడు. మూడో సెషన్ ఆఖర్లో మళ్లీ తిరిగి
బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. లంచ్ తర్వాత ఒక్క ఓవర్ మాత్రమే వేసిన అతడు అర్ధంతరంగా మైదానం వీడాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకొన్నాడు. మూడో సెషన్ ఆఖర్లో మళ్లీ తిరిగి వచ్చాడు. అయితే, అతడి గాయం తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ, ఆటముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు ప్రసిద్ధ్ కృష్ణ తెలిపాడు. బుమ్రా బౌలింగ్ చేసే విషయమై వైద్యులు ఆదివారం స్పష్టత నివ్వనున్నారు. బ్యాటింగ్ చేయడంలో అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేవని తెలుస్తోంది. గతంలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొన్న సంగతి తెలిసిందే.
తొలి భారత బౌలర్‌గా..
విదేశీగడ్డపై ఓ సిరీ్‌సలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. లబుషేన్‌ను అవుట్ చేసిన బుమ్రా.. 32వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఈ క్రమంలో 1977-78 పర్యటనలో బిషన్ సింగ్ బేదీ (31 వికెట్లు), భగవత్ చంద్ర శేఖర్ (28 వికెట్లు)ను బుమ్రా అధిగమించాడు. కాగా, భారత్-ఆసీ్‌స మధ్య జరిగిన సిరీ్‌సలో అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టిన హర్భజన్ రికార్డును బుమ్రా సమం చేశాడు. 2001 భారత పర్యటనలో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భజ్జీ ఈ ఫీట్ సాధించాడు.