జస్‌ప్రీత్ కెరీర్ ఉత్తమ రేటింగ్
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:03 AM
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్ ఉత్తమ రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీ్‌సలోని మెల్‌బోర్న్ టెస్టులో తొమ్మిది వికెట్లు తీసిన...
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్ ఉత్తమ రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీ్‌సలోని మెల్‌బోర్న్ టెస్టులో తొమ్మిది వికెట్లు తీసిన అనంతరం బుమ్రా 907 పాయింట్లతో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు అత్యుత్తమ రేటింగ్ జాబితాలో ముందు ఉన్న మాజీ స్పిన్నర్ అశ్విన్‌ను బుమ్రా తాజాగా అధిగమించాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్‌లో నిలవగా, ఆసీస్ బౌలర్లు హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో స్థానం మెరుగై వరసగా రెండు, మూడు ర్యాంక్‌లను దక్కించుకున్నారు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నితీష్ 20 స్థానాలు మెరుగై 53వ ర్యాంక్‌లో నిలిచాడు.