Share News

‘హజారే’ ఫైనల్లో కర్ణాటక

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:57 AM

విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక 5 వికెట్లతో హరియాణాను ఓడించింది. మొదట హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో...

‘హజారే’ ఫైనల్లో కర్ణాటక

వడోదర: విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక 5 వికెట్లతో హరియాణాను ఓడించింది. మొదట హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ 48 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అభిలాష్‌ శెట్టి 4 వికెట్లు తీశాడు. ఛేదనలో కర్ణాటక.. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (86), రవిచంద్రన్‌ స్మరణ్‌ (76) అర్ధ సెంచరీలతో సత్తా చాటడంతో 47.2 ఓవర్లలోనే 238/5 స్కోరు చేసి గెలిచింది. గురువారం విదర్భ, మహారాష్ట్ర జట్ల మధ్య రెండో సెమీస్‌ జరగనుంది.

Updated Date - Jan 16 , 2025 | 05:57 AM