KL Rahul: సంజీవ్ గోయెంకాను లైట్ తీసుకున్న రాహుల్.. మ్యాచ్ అనంతరం ఏం జరిగిందంటే
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:30 PM
గతేడాది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సారథి అయిన రాహుల్ ఈ ఏడాది వేలంలో ఢిల్లీ జట్టుకు మారి తడఖా చూపిస్తున్నాడు. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తనను గతంలో అవమానించిన జట్లపై చెలరేగి ఆడుతూ పగ తీర్చుకుంటున్నాడు.
కేఎల్ రాహుల్ గతేడాది ఐపీఎల్‌లో చేదు అనుభవాలను ఎదుర్కొన్న కేఎల్ రాహల్ (KL Rahul) తాజా ఐపీఎల్‌లో (IPL 2025) మాత్రం సత్తా చాటుతుతన్నాడు. గతేడాది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)కు సారథి అయిన రాహుల్ ఈ ఏడాది వేలంలో ఢిల్లీ జట్టుకు మారి తడఖా చూపిస్తున్నాడు. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తనను గతంలో అవమానించిన జట్లపై చెలరేగి ఆడుతూ పగ తీర్చుకుంటున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో బెంగళూరు తరఫున ఆడాలని రాహుల్ ఎంతో ఆశపడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ తనను వేలంలో దక్కించుకుంటుందని అనుకున్నాడు.
గతేడాది జరిగిన మెగా వేలంలో కేఎల్ రాహుల్‌ను తీసుకునేందుకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఆసక్తి చూపలేదు. దీంతో ఢిల్లీ టీమ్ అతడిని దక్కించుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన అనంతరం మైదానంలో కేఎల్ రాహుల్ కాంతారా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్‌పై రాహుల్ రివేంజ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. తాజాగా లఖ్‌నవూ టీమ్‌తో ఢిల్లీ తలపడింది (LSG vs DC). ఈ మ్యాచ్‌లో కూడా రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు.
మ్యాచ్ అనంతరం రాహుల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి అతడితో మాట్లాడేందుకు ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka) ప్రయత్నించారు. అయితే అతడిని రాహుల్ పట్టించుకోలేదు. కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి ముందుకు వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న సంజీవ్ గోయెంకా కొడుకు శశ్వాంత్ కూడా రాహుల్‌ను ఆపి ప్రశంసించేందుకు ప్రయత్నించాడు. అయితే రాహుల్ అక్కడ ఆగకుండా హడావిడిగా అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. గతేడాది ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ పరాజయం పాలవడంతో మైదానంలోనే కేఎల్ రాహుల్‌కు సంజీవ్ గోయెంకా క్లాస్ పీకిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..