Share News

కుశాల్‌ మెరుపు శతకం

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:00 AM

కుశాల్‌ పెరీరా (46 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంక ఏడు పరుగులతో నెగ్గింది. పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంక తరపున వేగవంతమైన సెంచరీ ఇది..

కుశాల్‌ మెరుపు శతకం

శ్రీలంక ఓదార్పు విజయం

కుశాల్‌ (46 బంతుల్లో 101)

నెల్సన్‌ (న్యూజిలాండ్‌): కుశాల్‌ పెరీరా (46 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంక ఏడు పరుగులతో నెగ్గింది. పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంక తరపున వేగవంతమైన సెంచరీ ఇది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో ఓదార్పు విజయం దక్కించుకుంది. తొలి రెండు టీ 20ల్లో గెలుపొందిన ఆతిథ్య జట్టు ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. కుశాల్‌, కెప్టెన్‌ అసలంక (46) నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఛేదనలో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 211/7 స్కోరుకే పరిమితమై ఓడింది. రచిన్‌ రవీంద్ర (69), టిమ్‌ రాబిన్సన్‌ (37) దూకుడైన ఆరంభం ఇవ్వగా, మిచెల్‌ (35), చివర్లో జకారీ ఫోక్స్‌ (21 నాటౌట్‌) పోరాడినా కివీ్‌సకు ఓటమి తప్పలేదు. అసలంక మూడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.

Updated Date - Jan 03 , 2025 | 06:00 AM