ఆసీ్‌సకు లంక షాక్
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:37 AM
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వరుస విజయాలకు శ్రీలంక చెక్ పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో...

అండర్-19 టీ20 వరల్డ్ కప్
బంగి (మలేసియా) : అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వరుస విజయాలకు శ్రీలంక చెక్ పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక 12 పరుగులతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. తద్వారా టోర్నమెంట్‌ను లంక మహిళలు విజయంతో ముగించారు. అయితే ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఇక..మ్యాచ్‌లో తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 99/8 స్కోరు చేసింది. ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో 87/8కే పరిమితమైంది. ప్రబోద, ప్రముది, అసేని తలా రెండేసి వికెట్లు తీశారు. లంక దిగ్గజ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ కుమార్తె లిమాన్స తిలకరత్నకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఓ వికెట్ తీయడంతోపాటు ఓ రనౌట్, ఇంకో క్యాచ్‌ను కూడా అందుకుంది. ఇక మరో గ్రూప్-2 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో నైజీరియా ఆరు పరుగులతో ఐర్లాండ్‌పై నెగ్గింది. ఇక..శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా తలపడతాయి.
ఇవీ చదవండి:
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది
పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి