Share News

సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:18 AM

నాలుగుసార్లు చాంపియన్‌ కర్ణాటక, మహారాష్ట్ర జట్లు విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకుపోయాయి. శనివారం ఉత్కంఠగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో కర్ణాట...

సెమీస్‌లో మహారాష్ట్ర, కర్ణాటక

వడోదర: నాలుగుసార్లు చాంపియన్‌ కర్ణాటక, మహారాష్ట్ర జట్లు విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకుపోయాయి. శనివారం ఉత్కంఠగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటక 5 పరుగులతో బరోడాపై నెగ్గింది. తొలుత కర్ణాటక 50 ఓవర్లలో 281/8 స్కోరు చేసింది. పడిక్కళ్‌ (102) శతకంతో చెలరేగాడు. ఛేదనలో బరోడా 49.5 ఓవర్లలో 276 రన్స్‌కు ఆలౌటైంది. రావత్‌ (104) శ్రమ వృథా అయింది. మరో క్వార్టర్స్‌లో మొదట మహారాష్ట్ర 275/6 స్కోరు చేసింది. అర్షిన్‌ కులకర్ణి (107) మెరిశాడు. అనంతరం పంజాబ్‌ 44.4 ఓవర్లలో 205 రన్స్‌కు ఆలౌటైంది.

Updated Date - Jan 12 , 2025 | 01:18 AM