అమ్మాయిల విజయంలో తెలుగోడు
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:35 AM
ఖోఖో వరల్డ్‌క్‌పను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు విజయంలో ఒక తెలుగోడి పాత్ర ఉండడం విశేషం. అతడి పేరు ఇస్లావత్ నరేష్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, బంజరపల్లి...

ఖోఖో వరల్డ్‌క్‌పను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు విజయంలో ఒక తెలుగోడి పాత్ర ఉండడం విశేషం. అతడి పేరు ఇస్లావత్ నరేష్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, బంజరపల్లి తండా నరేష్ స్వస్థలం. నరేష్ ప్రస్తుత భారత జట్టుకు సహాయ కోచ్. 1995లో ఆటగాడిగా కెరీర్ ప్రారంభించిన నరేష్ 2015లో ఎన్‌ఐఎస్ శిక్షణ పూర్తి చేసి కోచ్‌గా మారాడు. దక్షిణమధ్య రైల్వేలో 2016లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి తొలుత ఆ జట్టుకు సహాయ కోచ్‌గా ఆతర్వాత భారత రైల్వే జట్టు చీఫ్ కోచ్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు. తాజాగా ఖోఖో వరల్డ్‌కప్ నెగ్గిన భారత మహిళల జట్టుకు సహాయ కోచ్‌గా, స్కిల్ అనలైజర్‌గా క్రీడాకారుల ప్రదర్శనను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వారి తప్పులను, బలహీనతలను సరిచేస్తూ దేశానికి తొలి విశ్వక్‌పను అందించడంలో నరేష్ కీలకపాత్ర పోషించాడు. జట్టు ఫుట్‌వర్క్, డైవింగ్ పద్ధతులు మెరుగుపరచుకోవడంలోనూ నరేష్‌ది ప్రధాన భూమిక.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)