14,505 బంతులతో ఎంసీఏ గిన్నిస్ రికార్డు
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:49 AM
ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అరుదైన ఘనత సాధించింది. ‘క్రికెట్ బంతులతో కూడిన అతిపెద్ద వాక్యం’ పేరిట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది...

ముంబై: ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అరుదైన ఘనత సాధించింది. ‘క్రికెట్ బంతులతో కూడిన అతిపెద్ద వాక్యం’ పేరిట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది. స్థానిక వాంఖడే స్టేడియం 50 ఏళ్ల సంబరాలను ఇటీవల ఎంసీఏ ఘనంగా నిర్వహించింది. దీంట్లో భాగంగానే 14,505 బంతులను ఉపయోగిస్తూ ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం’ అని ఇంగ్లీషులో రాయడంతో రికార్డుల కెక్కింది.