Share News

Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:56 PM

పేద కుటుంబానికి చెందిన విఘ్నేష్‌కు క్రికెట్ అంటే ఎంతో పిచ్చి. కేరళ క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్పిన్నర్‌గా సత్తా చాటిన విఘ్నేష్ ప్రతిభ ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది. అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుని అతడిని మరింత ప్రోత్సహించింది.

Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
Vignesh Puthur

విఘ్నేష్ పుత్తుర్ (Vignesh Puthur).. ఈ 24 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌ (IPL 2025)లో ఆడిన తొలి మ్యాచ్‌తోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. కేరళకు చెందిన విఘ్నేష్ పుత్తుర్ తండ్రి ఓ ఆటో డ్రైవర్. పేద కుటుంబానికి చెందిన విఘ్నేష్‌కు క్రికెట్ అంటే ఎంతో పిచ్చి. కేరళ క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో స్పిన్నర్‌గా సత్తా చాటిన విఘ్నేష్ ప్రతిభ ముంబై ఇండియన్స్ (MI) టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది. అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుని అతడిని మరింత ప్రోత్సహించింది.


ముంబై టీమ్‌లోని స్టార్ ఆటగాళ్లు, కోచ్‌ల పర్యవేక్షణలో విఘ్నేష్ మరింత రాటు తేలాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్ చూసి రోహిత్, సూర్య కుమార్, తిలక్ యాదవ్‌లు కూడా మెచ్చుకున్నారు. విఘ్నేష్‌ను ఆడడం అంత తేలిక కాదని చెప్పారు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం పెట్టి తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని విఘ్నేష్ సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి కీలకమైన రుతురాజ్ గైక్వాడ్, శివబ్ దూబె, దీపక్ హుడా వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోనే విఘ్నేష్‌ను ధోనీ (MS Dhoni) మెచ్చుకున్నాడు.


మ్యాచ్ అనంతరం ధోనీని విఘ్నేష్ కలుసుకున్నాడు. విఘ్నేష్‌ను చూసి ధోనీ అతడి బౌలింగ్ తీరును మెచ్చుకున్నాడు. అతడి వయసు ఎంతో అడిగి తెలుసుకున్నాడు. ఐపీఎల్‌లోకి వచ్చేందుకు ఎంత కష్టపడ్డావో, అదే కష్టాన్ని కొనసాగించాలని సూచించాడు. గొప్ప గొప్ప ప్లేయర్లతో కలిసి ఆడతానని, వారితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటానని ఊహించలేదని విఘ్నేష్ మ్యాచ్ అనంతరం తన స్పందన తెలియజేశాడు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన


Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 02:56 PM