Mohammed Shami: ఈ సారి టార్గెట్ షమీ కూతురు.. హోలీ ఆడిన షమీ కూతురిపై ముస్లిం పెద్ద ఆగ్రహం..
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:10 PM
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో షమీ కూల్‌డ్రింక్ తాగుతూ కనిపించాడు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం అయిన షమీ ఉపవాసం పాటించకుండా డ్రింక్ తాగడం మత నియమాలకు విరుద్ధమని, ఖురాన్ ప్రకారం షమీ నేరస్తుడు అని షాబుద్ధీన్ రజ్వీ విమర్శలు చేశారు. తాజాగా షమీ కూతురిని టార్గెట్ చేశారు.

టీమిండియా స్టార్ బౌరల్ మహ్మద్ షమీ (Mohammed Shami) కొన్ని రోజులుగా మత సంబంధ వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలనా షాబుద్ధీన్ రజ్వీ.. షమీని టార్గెట్ చేస్తూ వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో షమీ కూల్‌డ్రింక్ తాగుతూ కనిపించాడు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం అయిన షమీ ఉపవాసం పాటించకుండా డ్రింక్ తాగడం మత నియమాలకు విరుద్ధమని, ఖురాన్ ప్రకారం షమీ నేరస్తుడు అని షాబుద్ధీన్ రజ్వీ (Shahabuddin Razvi) విమర్శలు చేశారు.
తాజాగా షమీ కూతురిని టార్గెట్ చేస్తూ షాబుద్ధీన్ రజ్వీ చేసిన కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. షమీ కూతురు (Mohammed Shami`s Daughter) ఇటీవల హోలీ (Holi) పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ముస్లిం అయిన షమీ కూతురు హిందూ పండగ హోలీని సెలబ్రేట్ చేసుకోవడంపై షాబుద్ధీన్ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీని సెలబ్రేట్ చేసుకోవడం నేరం అని కామెంట్ చేశారు. *నేను షమీకి, అతడి కుటుంబ సభ్యులకు ఓ సూచన చేస్తున్నా. షరియాలో లేని పనులను మీ పిల్లలు చేయడాన్ని అనుమతించకండి. హోలీ అనేది హిందువులకు పెద్ద పండగ. కానీ, ముస్లింలు హోలీని సెలబ్రేట్ చేసుకోకూడదు. షరియత్ తెలిసిన వారు హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం నేరం* అని రజ్వీ కామెంట్ చేశారు.
అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన టీమిండియాకు షాబుద్ధీన్ రజ్వీ శుభాకాంక్షలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన టీమిండియా కెప్టెన్‌కు, ఆటగాళ్లకు, మహ్మద్ షమీకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని రజ్వీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో మెసేజ్‌ను షాబుద్ధీన్ రజ్వీ విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్
Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..