Share News

ICC : ‘వైడ్‌ బాల్‌’ను మారుస్తాం

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:34 AM

క్రికెట్‌లో సాధారణంగా బ్యాటర్లదే హవా కనిపిస్తుంటుంది. బౌలర్లకు మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే వీరికి కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడు

ICC : ‘వైడ్‌ బాల్‌’ను మారుస్తాం

షాన్‌ పొలాక్‌

డర్బన్‌: క్రికెట్‌లో సాధారణంగా బ్యాటర్లదే హవా కనిపిస్తుంటుంది. బౌలర్లకు మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే వీరికి కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడు షాన్‌ పొలాక్‌ అభిప్రాయపడుతున్నాడు. ముఖ్యంగా వైడ్‌ బంతుల విషయంలో ప్రస్తుత నిబంధనల కారణంగా బౌలర్లు నష్టపోతున్నారని, దీంట్లో మార్పులు చేసే అవకాశం ఉందన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడాలని చూస్తుంటారు. దీంతో బౌలర్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ గతి తప్పుతోంది. వారిని కట్టడి చేసే ప్రయత్నంలో ఎక్కువగా బంతులను వైడ్‌గా వేస్తున్నారు. అందుకే ఐసీసీ క్రికెట్‌ కమిటీ సభ్యుడిగా ఇదే అంశంపై పనిచేస్తున్నా. వైడ్‌ విషయంలో బౌలర్లకు ప్రయోజనం ఉండేలా రూల్‌ను మారుస్తాం. ఎందుకంటే రనప్‌ సమయంలోనే ఓ బౌలర్‌కు ఎక్కడ బంతిని వేయాలనేది తెలిసుండాలి. కానీ చివరి నిమిషంలో బ్యాటర్‌ కదిలి అతడి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాడు. అందుకే ఒకవేళ బ్యాటర్‌ కదిలినప్పుడు బంతి అతడికి దూరంగా పడిందే అనుకుందాం. ఆ సమయంలో బ్యాటర్‌ ఎక్కడైతే ఉన్నాడో, అక్కడి నుంచే బంతి పడిన దూరాన్ని పరిశీలించాలి. అప్పుడే వైడ్‌పై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’ అని పొలాక్‌ వివరించాడు.

Updated Date - Jan 12 , 2025 | 05:35 AM