Javelin Thrower : ‘వరల్డ్ బెస్ట్’ నీరజ్
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:59 AM
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన ఘనత దక్కింది.
ఎంపిక చేసిన అమెరికా మేగజీన్
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన ఘనత దక్కింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మేగజీన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ 2024 ప్రపంచ అత్యుత్తమ జావెలిన్ త్రోయర్‌గా నీరజ్‌ను ఎంపిక చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 27 ఏళ్ల చోప్రా..పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మరో రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రెనడాకు చెందిన రెండుసార్లు ప్రపంచ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్‌ను వెనక్కు నెట్టిన నీరజ్ అమెరికా మేగజీన్ ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం చేసుకున్నాడు. 1948లో ఆవిర్భవించిన ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ పత్రికను క్రీడల్లో బైబిల్‌గా భావిస్తారు. విశ్వవ్యాప్త ట్రాక్, ఫీల్డ్ విభాగంలో ఈ మేగజీన్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి.