21 నుంచి రాజీవ్ గాంధీ టీ20 లీగ్
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:18 AM
ఆలిండియా రాజీవ్ గాంధీ టీ20 లీగ్‌ను ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్టు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎ్‌ఫఐ) చైర్మన్ వి.హనుమంతరావు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆలిండియా రాజీవ్ గాంధీ టీ20 లీగ్‌ను ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్నట్టు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎ్‌ఫఐ) చైర్మన్ వి.హనుమంతరావు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ అండర్-19 టీ20 లీగ్‌లో శ్రీలంక, దుబాయ్, మలేసియా జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ మూడు దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 14 జట్లు లీగ్‌లో తలపడనున్నాయి.