Rickelton : రికెల్టన్ ‘డబుల్’
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:07 AM
ఓపెనర్ రికెల్టన్ (259) ద్విశతకం, వెరీనే (100) సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 615 పరుగుల భారీ స్కోరు
దక్షిణాఫ్రికా 615 ఆలౌట్
కేప్‌టౌన్: ఓపెనర్ రికెల్టన్ (259) ద్విశతకం, వెరీనే (100) సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 615 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 316/4తో శనివారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టులో రికెల్టన్, వెరీనేతోపాటు యాన్సెన్ (62), కేశవ్ మహరాజ్ (40) కూడా సత్తా చాటడంతో వరుసగా రెండో రోజూ 300కు పైగా పరుగులు చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ వర్షంతో రెండోరోజు ఆట నిలిపి వేసే సరికి 64/3తో కష్టాల్లో పడింది.