Ritwik Chowdary : డబుల్స్ బరిలో రిత్విక్
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:38 AM
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈమారు ఐదుగురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో తెలుగు కుర్రాడు, హైదరాబాద్‌కు చెందిన రిత్విక్ చౌదరి బొల్లిపల్లి
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈమారు ఐదుగురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో తెలుగు కుర్రాడు, హైదరాబాద్‌కు చెందిన రిత్విక్ చౌదరి బొల్లిపల్లి ఉండడం విశేషం. అమెరికాకు చెందిన ర్యాగ్ సెగర్‌మ్యాన్ జతగా రిత్విక్ డబుల్స్‌లో పోటీపడుతున్నాడు. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న, యుకీ భాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ డబుల్స్‌లో వేర్వేరు భాగస్వాములతో కలిసి బరిలోకి దిగుతుండగా.. సుమిత్ నగాల్ సింగిల్స్‌లో తలపడుతున్నాడు.