క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:38 AM
భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి మలేసియా సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎ్‌స ప్రణయ్ పోరాడి...
ప్రణయ్ పరాజయం
కౌలాలంపూర్: భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి మలేసియా సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎ్‌స ప్రణయ్ పోరాడి ఓడాడు. గురువారం జరిగిన డబుల్స్ రెండో రౌండ్‌లో సాత్విక్/చిరాగ్ జంట 21-15, 21-15తో స్థానిక ద్వయం అజ్రిన్/టాన్‌పై గెలుపొందింది. హోరాహోరీగా సాగిన సింగిల్స్ రౌండ్-16 పోరులో ప్రణయ్ 8-21, 21-15, 21-13తో లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో మాళవికా బన్సోడ్ 18-21, 11-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. ఇక మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ జంట 21-15, 19-21, 19-21తో చైనా ద్వయం జియా యి/జాంగ్ షు చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్‌డ్‌లో సతీష్ కరుణాకరన్/ఆద్య 10-21, 17-21తో నాలుగో సీడ్ సూన్/షెవాన్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.