Share News

షమికి అవకాశం

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:40 AM

బుమ్రా మాదిరే మరో వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి రీఎంట్రీ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాదికి పైగా అవుతోంది. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో గాయపడ్డాక షమి జాతీయ జట్టుకు..

షమికి అవకాశం

చాంపియన్స్‌ ట్రోఫీ జట్టుపై ఊహాగానాలు

షమి ఖాయమే..

బుమ్రా మాదిరే మరో వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమి రీఎంట్రీ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏడాదికి పైగా అవుతోంది. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో గాయపడ్డాక షమి జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు. ప్రస్తుతం దేశవాళీల్లో విశేషంగా రాణిస్తుండడం అతడికి సానుకూలాంశం కానుంది. ఆసీస్‌ టూర్‌కు వెళ్తాడని భావించినా అతడి మోకాలు వాపునకు గురి కావడంతో సాధ్యం కాలేదు. ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతూ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటున్నాడు. అటు సెలెక్టర్లు కూడా షమిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి తుది అనుమతి లభిస్తే షమి టీమిండియాలోకి రావడం సులువవుతుంది. ఒకవేళ బుమ్రా అందుబాటులో లేకపోయినా షమి రాకతో పేస్‌ విభాగం జట్టుకు అండగా ఉంటుంది.

కివీస్‌ వైద్యుడిని

సంప్రదించిన బుమ్రా

ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ రోవన్‌ స్కౌటెన్‌ను సంప్రదించినట్టు సమాచారం. 2023లో అతనే బుమ్రాకు చికిత్స చేశాడు. అలాగే బీసీసీఐ మెడికల్‌ టీమ్‌తోనూ సర్జన్‌ టచ్‌లో ఉన్నట్టు, ఏ విషయం సెలెక్టర్లకు త్వరలోనే తెలుపుతారని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Jan 10 , 2025 | 03:40 AM