Share News

మళ్లీ బరిలో సింధు

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:07 AM

భారత్‌పాటు చైనా, జపాన్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా వంటి బలమైన దేశాలు..200 మందికిపైగా షట్లర్లు వారంపాటు బ్యాడ్మింటన్‌ అభిమానులను అలరించనున్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఇండియా ఓపెన్‌..

మళ్లీ బరిలో సింధు

నేటినుంచి ఇండియా ఓపెన్‌

తలపడనున్న అంతర్జాతీయ స్టార్లు

న్యూఢిల్లీ : భారత్‌పాటు చైనా, జపాన్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా వంటి బలమైన దేశాలు..200 మందికిపైగా షట్లర్లు వారంపాటు బ్యాడ్మింటన్‌ అభిమానులను అలరించనున్నారు. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత్‌ ఏకంగా 46 మందితో బరిలోకి దిగుతోంది. ఒలింపిక్‌ చాంపియన్లు అక్సెల్‌సెన్‌, అన్‌ సె యంగ్‌ కూడా తలపడుతుండడంతో టోర్నమెంట్‌ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆతిథ్య జట్టునుంచి పీవీ సింధుపై అందరి దృష్టీ నిలిచింది. గత ఏడాది పెద్దగా రాణించలేకపోయిన రెండుసార్లు ఒలింపిక్స్‌ పతక విజేత సింధు ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దాంతో ఈ సీజన్‌ తొలి టోర్నమెంట్‌ మలేసియా ఓపెన్‌లో పాల్గొనలేదు.


పెళ్లయ్యాక మొదటిసారి పోటీల బరిలోకి దిగుతున్న ఆమె తొలి రౌండ్‌లో యున్‌ సంగ్‌ (తైపీ)తో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో స్టార్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌పై అందరిదృష్టీ నిలవనుంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్‌-చున్‌ ఈతో, కిడాంబి శ్రీకాంత్‌-హాంగ్‌ యాంగ్‌తో టోర్నీని ఆరంభిస్తారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జాలీ-అరిసా/అయాకోను ఢీకొంటారు.

Updated Date - Jan 14 , 2025 | 05:07 AM