Share News

అలా.. వాళ్ల నోళ్లు మూయించాడు!

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:54 AM

మైదానంలో విరాట్‌ కోహ్లీ దూకుడు అలా..ఇలా ఉండదు. టీమిండియాను ఎవరు ఎద్దేవా చేసినా ఉపేక్షించడు. అతిగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు తనదైనరీతిలో బదులిచ్చాడు విరాట్‌. ఇంతకీ ఏం జరిగిందంటే...

అలా.. వాళ్ల నోళ్లు మూయించాడు!

మైదానంలో విరాట్‌ కోహ్లీ దూకుడు అలా..ఇలా ఉండదు. టీమిండియాను ఎవరు ఎద్దేవా చేసినా ఉపేక్షించడు. అతిగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కు తనదైనరీతిలో బదులిచ్చాడు విరాట్‌. ఇంతకీ ఏం జరిగిందంటే..సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో భారత క్రికెటర్‌ బుమ్రా బూటు సరి చేసుకుంటుండగా దానిలోంచి ఓ పేపర్‌ లాంటిది వచ్చింది. దాంతో భారత ఆటగాళ్లు ‘శాండ్‌ పేపర్‌’ ఉపయోగిస్తున్నారని ఆసీస్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆరోపణలు గుప్పించారు. ఇక సీన్‌ కట్‌ చేస్తే..ఆదివారం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ అవుటయ్యాక..తన ప్యాంటు జేబుల్లో, ఇంకా ప్యాంటు లోపలా ఎక్కడా ‘శాండ్‌ పేపర్‌’ లాంటిది ఏదీ లేదంటూ ఆతిథ్య జట్టు ఫ్యాన్స్‌కు సంజ్ఞ చేయడం ద్వారా కోహ్లీ వాళ్ల నోళ్లు మూయించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ బ్యాటర్‌ బాన్‌క్రా్‌ఫ్ట శాండ్‌ పేపర్‌తో బంతికి మెరుపు తెస్తూ టీవీ కెమెరాకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.


ఆ ఉదంతంలో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌-కెప్టెన్‌ వార్నర్‌ కూడా దోషులుగా తేలారు. ‘శాండ్‌ పేపర్‌ గేట్‌’ కుంభకోణంగా పేరుపొందిన ఆ ఘటనలో బాన్‌క్రా్‌ఫ్ట, స్మిత్‌, వార్నర్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా వేటు వేసింది. అలా..ఆ ఘటనను కోహ్లీ గుర్తు చేస్తూ ఆసీస్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు.

Updated Date - Jan 06 , 2025 | 05:54 AM