ఆర్చరీ ప్రపంచకప్ జట్టులో సురేఖ, చికిత, ధీరజ్
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:56 AM
ఆర్చరీ వరల్డ్‌కప్ జట్టులో జ్యోతి సురేఖకు మరోసారి చోటు దక్కింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడా, మేలో షాంఘైలో జరిగే స్టేజ్ 1, 2 వరల్డ్‌క్‌పల కోసం కోల్‌కతాలో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో...
న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్‌కప్ జట్టులో జ్యోతి సురేఖకు మరోసారి చోటు దక్కింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడా, మేలో షాంఘైలో జరిగే స్టేజ్ 1, 2 వరల్డ్‌క్‌పల కోసం కోల్‌కతాలో నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో సురేఖ సహా ముగ్గురు తెలుగు ఆర్చర్లు అర్హత సాధించారు. భారత మహిళల కాంపౌండ్ జట్టులో సురేఖ, పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత.. పురుషుల రికర్వ్ విభాగంలో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవరకు స్థానాలు లభించాయి. సురేఖ 15వ ఏడాది దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం.