Share News

వైశాలి..కాంస్య పతకధారి

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:16 AM

ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌పను భారత్‌ ఘనంగా ముగించింది. బ్లిట్జ్‌ విభాగంలో మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.వైశాలి కాంస్య పతకంతో మురిసింది. తెలుగు తేజం కోనేరు హంపి ర్యాపిడ్‌ విభాగంలో...

వైశాలి..కాంస్య పతకధారి

వరల్డ్‌ బ్లిట్జ్‌ చెస్‌లో మూడోస్థానం

ఓపెన్‌ సంయుక్త విజేతలు కార్ల్‌సన్‌, నెపోమ్నియాచి

న్యూయార్క్‌ : ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌పను భారత్‌ ఘనంగా ముగించింది. బ్లిట్జ్‌ విభాగంలో మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.వైశాలి కాంస్య పతకంతో మురిసింది. తెలుగు తేజం కోనేరు హంపి ర్యాపిడ్‌ విభాగంలో స్వర్ణ పతకంతో అదరగొట్టిన విషయం విదితమే. ఇక పురుషుల విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నెపోమ్నియాచి సంయుక్త విజేతలుగా నిలిచారు. మహిళల కేటగిరీ..క్వార్టర్‌ఫైనల్లో చైనా క్రీడాకారిణి జూ జినెర్‌ను 2.5-1.5తో ఓడించిన వైశాలి సెమీ్‌సలో అదే స్థాయిలో రాణించలేకపోయింది. చైనాకే చెందిన జు వెన్‌జున్‌ చేతిలో 0.5-2.5తో వైశాలి సెమీఫైనల్లో ఓటమి చవిచూసింది. ఆమె కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెన్‌జున్‌ బ్లిట్జ్‌ టైటిల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో సహచరి లీ టింగ్‌జీపై 3.-5-2.5తో నెగ్గిన జున్‌ స్వర్ణం దక్కించుకుంది. లీ టింగ్‌జీ రజతానికి పరిమితమైంది. కాగా వైశాలి తమ్ముడు ప్రజ్ఞానంద కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాంస్య పతకం చేజిక్కించుకున్న తమిళనాడు అమ్మాయి వైశాలిని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌, అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ అభినందించాడు.


8-Spr.jpg

కార్ల్‌సన్‌-నెపోమ్నియాచికి స్వర్ణం..

బ్లిట్జ్‌ ఓపెన్‌ విభాగం స్వర్ణ పతకాన్ని కార్ల్‌సన్‌, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ఇయాన్‌ నెపోమ్నియాచి సంయుక్తంగా అందుకున్నారు. ఫైనల్లో తొలి రెండు గేమ్‌లను కార్ల్‌సన్‌ గెలిచాడు. దాంతో మరో గేమ్‌ను అతడు డ్రా చేసుకుంటే టైటిల్‌ సొంతమయ్యేది. కానీ పుంజుకున్న నెపోమ్నియాచి తదుపరి రెండు గేమ్‌లలో గెలుపొందాడు. దాంతో 2-2తో స్కోరు సమమైంది. ఈనేపథ్యంలో మూడు గేమ్‌ల సడన్‌ డెత్‌ను నిర్వహించారు. అవి కూడా డ్రా కావడంతో సంయుక్త టైటిల్‌కోసం కార్ల్‌సన్‌ ప్రతిపాదించాడు. దానికి నెపోమ్నియాచి కూడా అంగీకరించాడు. ఫలితంగా..వారిద్దరిని సంయుక్త విజేతలుగా ప్రకటించారు. బ్లిట్జ్‌ టైటిల్‌ ఇలా ఇద్దరికీ కలిపి ఇవ్వడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కార్ల్‌సన్‌ ఎనిమిదోసారి బ్లిట్జ్‌ చాంపియన్‌గా నిలవగా, నెపోమ్నియాచికి ఇదే మొదటి టైటిల్‌.


మాగ్నస్‌ మరో వివాదం..

కార్ల్‌సన్‌ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. బ్లిట్జ్‌ విభాగం తొలి రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ మైకేల్‌ బెజోల్డ్‌ (జర్మనీ)తో కార్ల్‌సన్‌ తలపడ్డాడు. మూడు నిమిషాల ఆ గేమ్‌కు మాగ్నస్‌ ఒక నిమిషం 11 సెకన్లు ఆలస్యంగా వచ్చి వివాదాస్పదుడయ్యాడు. కొత్త జీన్స్‌ కొనుక్కోవడంలో ఆలస్యమైందని మాగ్నస్‌ చెప్పాడు. కాగా టోర్నమెంట్‌ ర్యాపిడ్‌ విభాగం పోటీలకు డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించి జీన్స్‌ వేసుకొని రావడంతో కార్ల్‌సన్‌ను నిర్వాహకులు బహిష్కరించిన విషయం విదితమే.

మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారా ?

కార్ల్‌సన్‌, నోపోమ్నియాచి సంయుక్త విజేతలుగా నిలవడం దుమారం రేపుతోంది. వీరిద్దరూ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఫైనల్‌ సందర్భంగా వేదిక వెనుక.. మాగ్న్‌స-ఇయాన్‌ మాట్లాడుకున్న వీడియో ఒకటి ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ‘ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ఫిడే ప్రకటించేలా చిన్నపాటి డ్రాలతో గేమ్‌లను ముగిద్దాం’ అని నెపోమ్నియాచితో కార్ల్‌సన్‌ అనడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది.

Updated Date - Jan 02 , 2025 | 06:17 AM