Share News

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:57 PM

ఐపీఎల్‌లో శుక్రవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య హై వోల్టేజ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
Virat Kohli Warning

ఐపీఎల్‌ (IPL 2025)లో శుక్రవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య హై వోల్టేజ్ జరిగింది (CSK vs RCB). ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బౌలర్ పతిరన వేసిన బౌన్సర్ కోహ్లీ హెల్మెట్‌కు తగలడం, ఆ తర్వాత రెండు బంతులకు కోహ్లీ బౌండరీలు బాదడం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇలాంటి సీన్ ఒకటి కోహ్లీకి ఎదురైంది. సీఎస్కేకు చెందిన బౌలర్ ఖలీల్ అహ్మద్‌ (Khaleel Ahmed)కు, కోహ్లీకి మధ్య ఈ హై వోల్టేజ్ సీన్ జరిగింది.


కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఖలీల్ అహ్మద్ ఓ షార్ప్ బౌన్సర్ వేశాడు. ఆ బౌన్సర్‌ను కోహ్లీ మిస్సయ్యాడు. దీంతో ఖలీల్.. కోహ్లీకి బాగా దగ్గరగా వెళ్లి కళ్లలో కళ్లు పెట్టి రెచ్చగొట్టేలా చూశాడు. ఆ తర్వాత కోహ్లీ అవుటై పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు చేతులు కలుపుకునే సందర్భంలో డ్రామా చోటు చేసుకుంది. కోహ్లీకి దగ్గరకు వచ్చిన అహ్మద్ చేతులు కలిపి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే కోహ్లీ మాత్రం మెత్తబడలేదు. అతడి చేతులు పట్టుకుని దూరంగా నెట్టేసే ప్రయత్నం చేశాడు. కోహ్లీ వెనుకే ధోనీ కూడా ఉన్నాడు.


కోహ్లీ, అహ్మద్ మాటలను వింటూ ధోనీ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ తర్వాత కోహ్లీ జడేజాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఖలీల్ అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ సీరియస్‌గా మాట్లాడుతున్నట్టు నటించి ఖలీల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. చుట్టు పక్కల ఉన్న వారందరూ వారి సంభాషణ చూసి నవ్వుకున్నారు. ఖలీల్ కూడా నవ్వుకుని కోహ్లీతో మాట్లాడాడు. తర్వాత ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 05:32 PM