Share News

Virat Kohli: వెబ్‌సిరీస్‌లో అనుష్క భర్త.. అచ్చం కోహ్లీని పోలి ఉన్న ఈ నటుడిని చూడండి..

ABN , Publish Date - Mar 26 , 2025 | 07:30 PM

సెలబ్రిటీలను పోలిన సాధారణ వ్యక్తులు అప్పుడప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీలో అక్కడకు వచ్చి సందడి చేశాడు.

Virat Kohli: వెబ్‌సిరీస్‌లో అనుష్క భర్త.. అచ్చం కోహ్లీని పోలి ఉన్న ఈ నటుడిని చూడండి..
Virat Kohlis look alike

సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారని అంటుంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలను పోలిన సాధారణ వ్యక్తులు అప్పుడప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని పోలిన ఓ వ్యక్తి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో అక్కడకు వచ్చాడు. టీమిండియా జెర్సీలో అక్కడకు వచ్చి సందడి చేశాడు. అలాగే కోహ్లీని పోలీ ఉండే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు. కోహ్లీని పోలిన వ్యక్తులు భారత్‌లోనే కాదు.. విదేశాల్లో కూడా ఉన్నారు (Virat Kohlis look alike).


తుర్కియేకు చెందిన నటుడు కావిట్ సెటెన్ గునెర్ (Cavit Cetin Guner) అచ్చం కోహ్లీని పోలి ఉన్నాడు. తుర్కియే సిరీస్ అయిన దిరిలిస్‌లో ఈ సెటెన్ గునెర్ నటించాడు. ఆ సిరీస్ చూసిన ఓ భారతీయుడు కోహ్లీని పోలి ఉన్న సెటెన్ గునెర్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనుష్క శర్మ భర్త టీవీ అరంగేట్రం అని కామెంట్ చేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ ఫొటో చూసిన కోహ్లీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


ఆ నటుడు అచ్చం కోహ్లీలాగానే ఉన్నాడని చాలా మంది కామెంట్లు చేశారు. అతడు కోహ్లీ కాదని చెప్పకండి అంటూ ఒకరు కామెంట్ చేశారు. అతడు తుర్కియే కోహ్లీ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. కాగా, ఈ తుర్కియే సిరీస్ అయిన దిరిలిస్ ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి..

Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..


Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 07:30 PM