Share News

ఎవరీ బసవారెడ్డి?

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:30 AM

ఈసారి ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌తో తలపడబోయే ఆటగాడు తెలుగు మూలాలున్న 19 ఏళ్ల అమెరికా టెన్నిస్‌ ఆటగాడు నిషేష్‌ బసవారెడ్డి. ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్న...

ఎవరీ బసవారెడ్డి?

ఈసారి ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌లో దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌తో తలపడబోయే ఆటగాడు తెలుగు మూలాలున్న 19 ఏళ్ల అమెరికా టెన్నిస్‌ ఆటగాడు నిషేష్‌ బసవారెడ్డి. ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్న ఈ కుర్రాడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ ద్వారా బరిలోకి దిగుతున్నాడు. నెల్లూరుకు చెందిన నిషేష్‌ తల్లిదండ్రులు 1999లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో తరలి వెళ్లారు. తన ఆరాధ్య ఆటగాడైన జొకోవిచ్‌తో తలపడనుండడం ఎంతో సంతోషంగా, ఉద్వేగంగా ఉందన్నాడు నిషేష్‌. ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అయిన నిషేష్‌ గత ఏడాదే ప్రొఫెషనల్‌గా మారాడు. కాగా డబుల్స్‌లో భారత మూలాలున్న మరో ఆటగాడు రాజీవ్‌రామ్‌ తనకు మార్గదర్శనం చేశాడని నిషేష్‌ చెప్పాడు.

Updated Date - Jan 10 , 2025 | 03:30 AM