ఎవరీ హిమాని?
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:28 AM
హరియాణాలోని సోనీపట్‌కు చెందిన 25 ఏళ్ల హిమానీ మోర్.. 2021 వరకు టెన్నిస్ క్రీడలో కొనసాగింది. ఢిల్లీలోని ప్రఖ్యాత మిరండా హౌజ్ కళాశాల నుంచి రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో...

హరియాణాలోని సోనీపట్‌కు చెందిన 25 ఏళ్ల హిమానీ మోర్.. 2021 వరకు టెన్నిస్ క్రీడలో కొనసాగింది. ఢిల్లీలోని ప్రఖ్యాత మిరండా హౌజ్ కళాశాల నుంచి రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో డిగ్రీ చేసిన హిమాని.. ప్రస్తుతం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చదువుతోంది. హిమాని టెన్ని్‌సలో అంతర్జాతీయస్థాయిలో ఆడకపోయినా.. జాతీయస్థాయిలో మాత్రం రాణించింది. 2018లో జాతీయస్థాయిలో అత్యుత్తమంగా సింగిల్స్‌లో 42వ, డబుల్స్‌లో 27వ ర్యాంకును అందుకుంది.