Share News

చాంపియన్స్‌ బరిలో ఎవరు?

ABN , Publish Date - Jan 09 , 2025 | 02:16 AM

ఆస్ట్రేలియా టూర్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల కెరీర్‌ ముగిసిందంటూ ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, భారత క్రికెట్‌ బోర్డు వారికి చివరి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది...

చాంపియన్స్‌ బరిలో ఎవరు?

రాహుల్‌, జడేజా, షమికి చోటు దక్కేనా?

రోహిత్‌కే పగ్గాలు!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్‌లో ఘోరంగా విఫలమైన సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీల కెరీర్‌ ముగిసిందంటూ ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, భారత క్రికెట్‌ బోర్డు వారికి చివరి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి హైబ్రిడ్‌ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌/దుబాయ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ)లో బరిలోకి దిగే భారత జట్టులో ఇద్దరికీ చోటు కల్పించనున్నట్టు సమాచారం. సారథిగా రోహిత్‌ శర్మనే కొనసాగించవచ్చు. అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ శనివారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయుతే, వన్డే ఫార్మాట్‌లో ముగ్గురు సీనియర్లు కేఎల్‌ రాహుల్‌, షమి, జడేజా భవితవ్యంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. గత వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత షమి, జడేజాకు పూర్తిగా విశ్రాంతినివ్వగా.. రాహుల్‌ మాత్రం దక్షిణాఫ్రికా, శ్రీలంకతో సిరీ్‌సలలో కనిపించాడు. కాగా, యువ కెరటం యశస్వీ జైస్వాల్‌ వన్డేల్లో అరంగేట్రం చేసే చాన్సుంది. పంత్‌కు చోటు లభిస్తే రాహుల్‌ అవసరం ఉండకపోవచ్చు. ఇక, ఎంపికలో కోచ్‌ గంభీర్‌ హవా నడిస్తే సంజూ శాంసన్‌కు చోటు దక్కినా ఆశ్చర్యపోనవ సరం లేదు. చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.


1-spr.jpg

భారత బృందం (అంచనా)

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), గిల్‌, యశస్వీ జైస్వాల్‌, విరాట్‌ కోహ్లీ, రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి/బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌/షమి, రింకూ/తిలక్‌.

అక్షర్‌కే ఓటు!

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా ఆకట్టుకోలేకపోతున్నాడు. అతడితో పోల్చితే అక్షర్‌ పటేల్‌ ప్రదర్శన మెరుగ్గా ఉంది. దీంతో సెలెక్టర్లు అక్షర్‌వైపే మొగ్గే చాన్స్‌ లేకపోలేదు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా సత్తాచాటుతున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పూర్తి ఫిట్‌గా ఉంటే అతడి చోటుకు ఢోకా లేదు. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే రవి బిష్ణోయ్‌ లేదా వరుణ్‌ చక్రవర్తిలో ఒకరిని ఎంపిక చేసే చాన్సులున్నాయి. ఇక, షమి ఫిట్‌నెస్‌ విషయమై ఇంత వరకు స్పష్టత రాలేదు. ఇటీవలే విజయ్‌ హజారే ట్రోఫీలో షమి బౌలింగ్‌ చేశాడు. మరోవైపు స్టార్‌ పేసర్‌ బుమ్రా వెన్నునొప్పిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకవేళ అతడు చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైతే మాత్రం జట్టుకు పెద్దదెబ్బే. ఇక, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా ఉండడంతో.. నితీశ్‌ కుమార్‌ పరిస్థితి ప్రశ్నార్థకమైంది. రిజర్వు ఆటగాళ్లుగా రింకూ సింగ్‌ లేదా తిలక్‌ వర్మ ఎంపికయ్యే ఆస్కారముంది.

Updated Date - Jan 09 , 2025 | 02:16 AM