Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధన శ్రీ మూడేళ్ల క్రితమే విడిపోయారా.. డైవర్స్ పిటిషన్‌లో ఏముందంటే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:57 PM
యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పరస్పర అవగాహనతోనే విడిపోతున్నారు కాబట్టి వీరికి అరు నెలల తప్పనిసరి కాల వ్యవధి అక్కర్లేదని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముంబై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు (Mumbai family Court) గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. పరస్పర అవగాహనతోనే విడిపోతున్నారు కాబట్టి వీరికి అరు నెలల తప్పనిసరి కాల వ్యవధి అక్కర్లేదని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముంబై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది (Chahal-Dhanashree Divorce).
కోర్టులో ప్రవేశపెట్టిన డైవర్స్ పిటిషన్ ప్రకారం.. 2020లో వివాహం చేసుకున్న ఛాహల్, ధన శ్రీ రెండేళ్లకే అంటే 2022 జూన్ నాటికే విడిపోయారనే సంచలన విషయం బయటపడింది. అంటే ఇప్పటికి దాదాపు మూడేళ్ల క్రితం నుంచే వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరి విడాకులు వార్తలు గతేడాదే వెలుగులోకి వచ్చాయి. కొన్ని నెలల క్రితం డైవర్స్ కోసం వీరు ముంబైలోని బాంద్రా కోర్టును ఆశ్రయించారు. నెల రోజుల వ్యవధిలోపే వీరికి విడాకులు మంజూరు అయిపోయాయి. ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
ఛాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025 కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యేలోపునే విడాకుల ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని ఛాహల్ భావించాడు. ఆ మేరకు అతడి తరఫు లాయర్ నితిన్ గుప్తా ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మార్చి 20వ తేదీ లోపు విడాకులపై తుది నిర్ణయాన్ని వెలువరించాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఛాహల్, ధనశ్రీకి విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఎస్ఆర్‌హెచ్ మ్యాచుల టికెట్స్ బుక్ చేసుకోండిలా..
హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి