iPhone 16: టెక్ ప్రియులకు బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:49 PM
మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఐఫోన్ ప్రియులకు మరో క్రేజీ న్యూస్ వచ్చేసింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ కొనసాగుతోంది. మీరు కనుక ఇదే సమయంలో ఐఫోన్ 16 కొనుగోలు చేయాలని భావిస్తే, మీకు మంచి తగ్గింపు ధర లభిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఐఫోన్ 16పై రూ. 25,000 వేలకుపైగా తగ్గింపును అందిస్తున్నాయి. అయితే ఇది ఎలా సాధ్యం, ఏ మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారీ తగ్గింపు
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16, 128GB మోడల్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ అసలు ధర ప్రస్తుతం రూ.79,900 కాగా, దీనిపై దాదాపు 10% తగ్గింపును అందిస్తున్నారు. ఎలాగంటే మీరు మీ పాత ఐఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు ఈ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ విధానం ద్వారా కస్టమర్లు రూ.27,350 వరకు తగ్గింపును పొందవచ్చు.
దీంతోపాటు బ్యాంక్ కార్డులపై కూడా..
ఈ క్రమంలో మీరు రూ. 26,000 తగ్గింపును పొందినట్లయితే, ఐఫోన్ 16ను మీరు కేవలం రూ.53,900కి మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చు. ఒక వేళ మీరు పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ ఇస్తే, మీకు మరింత ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై దాదాపు రూ. 4,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అంటే మీకు ఐఫోన్ 16 కేవలం రూ.49,900కే లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిస్ప్లే
6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్, మంచి విజువల్స్‌ను అందిస్తుంది. ఇది ఆపిల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో రక్షించబడినది. అంటే స్క్రాచ్‌ల నుంచి మరింత భద్రతను అందిస్తుంది.
డిజైన్
ఐఫోన్ 16లో చక్కటి అల్యూమినియం ఫ్రేమ్, సొగసైన గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంది. దీని IP68 రేటింగ్ వల్ల, ఇది నీటి నుంచి భద్రతను అందిస్తుంది. అంటే ఈ ఫోన్ నీటిలో పడినా అది పని చేయగలదు.
ప్రదర్శన, పనితీరు
ఈ ఫోన్ iOS 18 ద్వారా నడుస్తుంది. ఇది స్మూత్, రీల్-టైం ప్రదర్శనను అందిస్తుంది. ఇందులో ఉన్న ఆపిల్ A18 బయోనిక్ చిప్‌సెట్ అద్భుతమైన పనితీరు, శక్తివంతమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. 8GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌తో, ఇది అన్ని రకాల పనులను నిర్వహించుకునేందుకు సహాయపడుతుంది.
కెమెరా
ఐఫోన్ 16 కెమెరా సిస్టమ్ కూడా 48 ఎంపీ ప్లస్ 12 ఎంపీ మెగా పిక్సెల్‌తో వస్తుంది. దీని ద్వారా మీరు ఫోటోలు, వీడియోలు, ఇతర డిజిటల్ చిత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీసుకోవచ్చు.
బ్యాటరీ
ఇది పవర్ ప్యాక్ బ్యాటరీతో వస్తుంది, ఈ బ్యాటరీ మీకు ఎక్కువ గంటలు పని చేసే విధంగా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5G కనెక్టివిటీ, అధిక నాణ్యత ఆడియో, సహా ఇంకా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News