Share News

Smart Phone: మొబైల్‌ను ఈ జేబులో పెట్టుకోకండి..

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:55 PM

చాలా మంది తమ ఫోన్‌ను జేబులో ఉంచుకుంటారు. అయితే, అలా పెట్టుకోవడం శరీరానికి హానికరం. ఈ అలవాటు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Smart Phone: మొబైల్‌ను ఈ జేబులో పెట్టుకోకండి..
Smart Phone

Smart Phone: చాలా మంది రోజులో ఎక్కువ సమయం మొబైల్‌తోనే గడుపుతుంటారు. ఎక్కడికి వెళ్లినా ఫోన్ ను తమ వెంట పెట్టుకుని తిరుగుతుంటారు. మహిళలు తమ ఫోన్‌లను పర్సులు లేదా బ్యాగ్‌లలో పెట్టుకుంటారు. పురుషులు మాత్రం తమ ఫోన్‌లను ప్యాంటు జేబులో ఉంచుకుంటారు. అయితే, స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ మన శరీరానికి హానికరం. ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా, ఫోన్లు అనివార్యంగా జేబులో పెట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ అలవాటు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గాలంటే మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ఏ పాకెట్ మంచిది? అనే విషయాలను తెలుసుకుందాం..

మంచిది కాదు..

ఉదయం లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒక్క క్షణం కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది. అయితే, స్మార్ట్‌ఫోన్‌లు శరీరానికి అంత మంచిది కాదని.. ఫోన్ శరీరానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు తరచుగా హెచ్చరిస్తున్నారు. అయినప్పట్టికీ చాలా మంది ఫోన్‌ను తమతో పాటు పెట్టుకుంటారు.


ఫోన్‌ను వీలైనంతవరకు ..

కొంత మంది స్మార్ట్‌ఫోన్‌లను ప్యాంటు ముందు జేబులో ఉంచుకుంటారు. ఇంకొందరు స్టైల్ కోసం ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటారు. మరికొందరు తమ రొమ్ము జేబులో ఉంచుకుంటారు. అయితే, ప్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే వెనుక జేబు చాలా గట్టిగా ఉంటుంది. నిరంతర వినియోగంతో స్మార్ట్‌ఫోన్‌లు కొన్నిసార్లు వేడెక్కుతాయి. ఫోన్ ను జేబులో ఉంచుకోవడం వల్ల వాపు రావడమే కాకుండా ఫోన్ పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాదు, ఫోన్‌ను వెనుక జేబులో ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఫోన్‌ను వీలైనంతవరకు బ్యాగ్‌లో ఉంచుకోవడం సురక్షితమని దొంగతనం జరిగే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే ఫోన్‌ను ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 14 , 2025 | 05:59 PM