Share News

Earthquake Alerts: భూకంపాన్ని ముందే తెలుసుకోండి..మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకుంటే చాలు..

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:30 PM

మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇదే సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి భూకంపాలు సంభవించడానికి ముందే.. మనం వీటిని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Earthquake Alerts: భూకంపాన్ని ముందే తెలుసుకోండి..మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకుంటే చాలు..
Earthquakes alerts on your mobile

ఇటీవల మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో తీవ్రమైన భూకంపం సంభవించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో అనేక మంది మరణించగా, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీంతో భారత్‌ సహా అనేక దేశాలు ఈ విపత్తుపై స్పందించాయి. అయితే భూకంపం సంభవించడానికి ముందే ప్రజలు వేగంగా అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో భూకంపం రావడానికి ముందు అప్రమత్తం కావడానికి గూగుల్ ఒక ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో భూకంపం సంభవించే ముందు హెచ్చరికలు పొందవచ్చని వెల్లడించారు.


భూకంపాన్ని పసిగట్టే ఫీచర్

గూగుల్, Android 15లో భూకంప డిటెక్టర్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఇది Android సిస్టమ్‌లో భాగంగా పని చేస్తుంది. భారతదేశంతో సహా అనేక దేశాలలో ఇది పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లలో భూకంపం సంభవించినప్పుడు, రియల్-టైమ్ హెచ్చరికలు అందుకుంటారు. ఈ హెచ్చరికల ద్వారా మీరు ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో సహాయపడతాయి. కానీ, తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు మాత్రం ఈ ఫీచర్ ద్వారా గుర్తించలేరు.


భూకంప హెచ్చరికలను మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడం ఎలా

  • దీని కోసం మీ ఫోన్‌లో ఈ భూకంప హెచ్చరికలను ఎలా సెట్ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

  • ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి

  • అందులో భద్రత & అత్యవసర పరిస్థితి (safety and emergency) ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

settings.jpg

  • ఆ తర్వాత దానిలో భూకంప హెచ్చరికలు (Earthquake Alerts) ఆప్షన్ ఎంచుకోండి

earth quake.jpg

  • ఆ ఫీచర్‌ ఒకవేళ ఆఫ్ మోడ్ విధానంలో ఉంటే, ఆన్ చేయండి

  • దానిని ఆన్ చేయడం ద్వారా మీరు భూకంప హెచ్చరికల సమాచారం లేదా అలర్ట్‌లను పొందవచ్చు


ఇది ఎలా పనిచేస్తుంది?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఉంటాయి. ఇవి భూకంప ప్రకంపనాలను గుర్తిస్తాయి. అప్పుడు, భూకంపం సంభవించే ముందు, ఈ సెన్సార్లు ప్రకంపనాలను గుర్తించి, వెంటనే మీరు మీ ఫోన్‌లో హెచ్చరికలను అందిస్తాయి. ఈ హెచ్చరికతో, మీరు భూకంప తీవ్రతను, దాని స్థానాన్ని తెలుసుకోగలుగుతారు. గూగుల్ ప్రకారం ఇంటర్నెట్ సిగ్నల్స్ భూకంప తరంగాల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. అందువల్ల, మీరు భూకంపం తీవ్రత పెరిగే ముందు ఈ హెచ్చరికలను పొందగలుగుతారు. ఇది ప్రజలను సురక్షితమైన ప్రాంతాల్లోకి తరలించడంలో సహాయపడుతుంది.


భూకంప హెచ్చరికల ప్రయోజనాలు

మీ పోన్ ద్వారా ఇలాంటి భూకంప హెచ్చరిక వ్యవస్థను ఉపయోగించుకోవడం ద్వారా తక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో మీ ప్రాణాలను రక్షించుకోవడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, ఎప్పుడైనా భూకంపం సంభవిస్తే, మీరు ముందుగా హెచ్చరికలు అందుకుని, మీరు అప్రమత్తంగా ఉండే ఛాన్సుంది. దీంతోపాటు ఇతరులను కూడా అప్రమత్తం చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Crypto Exchange Apps: 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్స్ నిషేధం.. వీటిలో ఏవేవి ఉన్నాయంటే..


Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 28 , 2025 | 06:38 PM