Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
ABN , Publish Date - Mar 22 , 2025 | 08:03 PM
ప్రతి రోజు మనం ఎన్ని ఇమెయిల్స్ అందుకుంటామో, వాటిని సరైన విధంగా సెర్చ్ చేయడం ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాలని చెప్పవచ్చు. కానీ అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జీమెయిల్ కొత్తగా ఏఐ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని స్పెషల్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి రోజుకో న్యూస్ వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోనే Gmail వినియోగదారుల కోసం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన ఫీచర్లను అందించేందుకు కొత్తగా ఏఐ ఆధారిత ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా Gmail ఇమెయిల్స్‌ను వేగంగా, ఈజీగా నిర్వహించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే Android, iOS, వెబ్‌లలో ఈ ఫీచర్, అందుబాటులో ఉంది. ఈ క్రమంలో దీనిని అందరికీ అమలు చేయాలని భావిస్తున్నారు.
మోస్ట్ రిలెవెంట్
గూగుల్ అందించిన కొత్త "మోస్ట్ రిలెవెంట్" అనే AI ఆధారిత ఫీచర్, Gmailలో ఇమెయిల్స్ సెర్చ్ చేయడంలో కీలక మార్పు తీసుకొస్తుంది. ఈ క్రమంలో ఇది సాంప్రదాయ సెర్చ్ పద్ధతిని పూర్తిగా మార్చి వేస్తుంది. Gmailలో శోధించిన ఇమెయిల్‌లు వరుస క్రమంలో చూపబడతాయి. కానీ ఇప్పుడు, ఈ కొత్త ఫీచర్, మీకు అత్యంత ముఖ్యమైన, సంబంధిత ఇమెయిల్‌లను అత్యధిక ప్రాధాన్యతతో చూపిస్తుంది.
వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా
ఈ ఫీచర్ ముఖ్యంగా మీ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. ఏదైనా కీవర్డ్ టైప్ చేసినప్పుడు, మీరు తిరిగి పాత ఇమెయిల్స్‌ను పరిశీలించడం అనేది నిత్యం జరిగే ప్రక్రియ. కానీ ఈ ఫీచర్ ద్వారా, Gmail, వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా ఇమెయిల్‌లను చూపిస్తుంది. మీరు తరచుగా మాట్లాడే వ్యక్తులు, గతంలో చేసుకున్న శోధనలు, తదితర వివరాల ఆధారంగా ఇది మీకు అత్యంత సంబంధిత ఇమెయిల్‌లను ముందుగా చూపిస్తుంది.
కొత్త మార్గాలను
దీంతో ఈ ఫీచర్, Gmailలో ఇమెయిల్స్ సెర్చ్ చేసేందుకు ఒక కొత్త మార్గాలను చూపిస్తుంది. పాత విధానంతో పోలిస్తే, వినియోగదారులు కేవలం కీవర్డ్ టైప్ చేసి, జాబితాలో స్క్రోల్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు, AI వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకుని, అత్యంత సంబంధిత, ముఖ్యమైన ఇమెయిల్‌లను తనిఖీ చేసి మీకు కనిపించేలా చేస్తుంది.
ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..
మీరు తరచుగా ఎవరి నుంచి ఇమెయిల్‌లు అందుకుంటున్నారు. మీరు ఎవరితో ఎక్కువగా సంభాషిస్తున్నారు. మీరు గతంలో చేసిన శోధనలు, చర్యలు ఎలా ఉన్నాయనే అంశాల ఆధారంగా, Gmail ఆటోమేటిక్‌గా మీకు అత్యంత సంబంధిత, ముఖ్యమైన ఇమెయిల్‌లను ముందుగా చూపిస్తుంది. తద్వారా మీరు అవసరమైన సమాచారాన్ని త్వరగా పొందవచ్చు.
స్మార్ట్ ఫిల్టరింగ్
Gmailలో శోధన ఫీచర్‌లో ఒక మరొక ముఖ్యమైన మార్పు "స్మార్ట్ ఫిల్టరింగ్" అనే కొత్త డ్రాప్‌డౌన్ మెనూ ప్రవేశపెట్టడం. ఈ మెనూ ద్వారా వినియోగదారులు శోధన ఫలితాల్లో "అత్యంత సంబంధితమైన" ఎంపికను గమనిస్తారు. ఇది AIని ఉపయోగించి, వినియోగదారులకు అత్యంత ముఖ్యమైన ఇమెయిల్‌లను ప్రాధాన్యతతో చూపిస్తుంది. పాత పద్ధతిలో ఇమెయిల్‌లు వరుస క్రమంలో చూపించబడతాయి.
ఇవి కూడా చదవండి:
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News

బిగ్ డీల్..ఐఫోన్ 16పై 25 వేలకుపైగా తగ్గింపు ఆఫర్..

గ్రోక్ 3లో ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ మామూలుగా లేదుగా..

ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

ఇండియన్ రైల్వే నుంచి క్రేజీ యాప్..ఇకపై అన్నీ కూడా..

జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో
