Share News

Google Maps: గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు.. దీని కోసం కూడా.. 99% మందికి దీని గురించి తెలియదు..

ABN , Publish Date - Mar 31 , 2025 | 08:06 PM

Google Maps hidden features: గూగుల్ మ్యాప్స్ కేవలం ఎలా వెళ్లాలో చూపించే డైరక్షన్ యాప్ మాత్రమే కాదు. తెలియని ప్రాంతాలకు కచ్చితంగా తీసుకెళ్లగలిగే ఈ యాప్ ఇందుకోసం కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈ విషయం 99% మందికి ఇది తెలియదు. అదేంటంటే..

Google Maps: గూగుల్ మ్యాప్స్ కేవలం లొకేషన్ కోసమే కాదు.. దీని కోసం కూడా.. 99% మందికి దీని గురించి తెలియదు..
Google Maps advanced tips

Google Maps hidden features: మనలో చాలా మంది ప్రతిరోజూ గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తారు. ఇది కేవలం లొకేషన్ కనుగొనే సాధనం అనే భావిస్తారు. ఈ యాప్ మీకు తెలియని, వాడని ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. దానిని గురించి తెలుసుకుంటే మరిన్ని పనులు చేసుకోగలరు. Google Maps ను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకుంటే అనేక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. మీకు తెలియని చిరునామాను చేరుకోవడానికి ఒక్కటే కాదు.. దీన్ని అనేక ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు. ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు Google Maps సెట్టింగ్‌లను మర్చాల్సి ఉంటుంది.


ప్లేసెస్ రేటింగ్

ఉదాహరణకు, మీరు రెస్టారెంట్లు, పెట్రోల్ పంపులు, ఇతర ప్రదేశాల కోసం వెతికారనుకోండి. మీరు ఈ స్థలాల పిన్‌లను వాటి Google స్టార్ రేటింగ్‌లతో పాటు మ్యాప్స్‌లో చూడవచ్చు. కాబట్టి, మీకు ఆహారం లేదా గ్యాస్ అవసరమైనప్పుడు Google Maps మీకు సహాయం చేయగలదు.


రైడింగ్

రైడ్‌లకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరంగా ఉంటుంది. మీరు రైడ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు Google Mapsలోనే వివిధ యాప్‌ల (Uber, Ola, Rapido, మొదలైనవి) ధరను తనిఖీ చేయవచ్చు. మీ గమ్యస్థానాన్ని టైప్ చేసి క్యాబ్ బటన్‌ను నొక్కితే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న రైడ్-షేరింగ్ సేవలను Google Maps మీకు చూపుతుంది.


షేరింగ్

మీ లొకేషన్ షేర్ చేయడానికి Google Maps బెస్ట్ ఆప్షన్. 'లొకేషన్ షేరింగ్' ఎంచుకోవడం ద్వారామీరు మీ స్థానాన్ని మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.


టైమింగ్స్, ఎయిర్ క్వాలిటీ చెక్

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలు గూగుల్ మ్యాప్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ప్రాంతంలో ఉంటే సమీపంలోని బస్సు, మెట్రో లేదా రైలు మార్గాలు వాటి టైమింగ్స్ చూడవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్నా Google Maps ద్వారా గాలి నాణ్యతను కూడా తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం 'Air Quality'ఆప్షన్ ఎంచుకోండి.


Read Also: Ghibli Art: జిబ్లిఫోటోల కోసం మీ ఫోటోలను చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..

Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..

iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్

Updated Date - Mar 31 , 2025 | 08:07 PM