UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారా?.. మీ పని అవుట్..
ABN , Publish Date - Mar 26 , 2025 | 08:22 PM
ఫోన్ పే, గూగుల్ పే.. యాప్ ఏదైనా కావచ్చు.. యూపీఐ పేమెంట్స్ ఈ మధ్య కాలంలో అత్యంత సాధారణ విషయంగా మారిపోయాయి. రూపాయి దగ్గరి నుంచి వేల రూపాయల వరకు యూపీఐ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి.

యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన క్యాష్ పేమెంట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. చిన్న బడ్డీ కొట్టు దగ్గరినుంచి కోట్ల రూపాయల బిజినెస్ చేసే షాపులు కూడా యూపీఐని వాడుతున్నాయి. కొంతమంది రూపాయి పేమెంట్ చేయడానికి కూడా యూపీఐ వాడుతున్నారు. అయితే, యూపీఐ ద్వారా కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే అంతే సంగతులు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది. బ్యాంక్ సర్వర్లు పని చేయకపోవడంతో పేమెంట్స్ అవ్వలేదు. దీంతో కొన్ని లక్షల మంది ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు గంటకు పైగా యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది. ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయింది.
ఆ గంటలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర 500 బిల్లు చేశాడు. యూపీఐ పేమెంట్ చేద్దామనుకున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా పేమెంట్ అవ్వలేదు. బ్యాంకులో తప్ప.. తన జేబిలో డబ్బులు కూడా లేవు. ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు లేవు. దీంతో చేసేదేమీ లేక తన ఫోన్‌ను షాపు అతని దగ్గర పెట్టేశాడు. డబ్బులు ఇచ్చిన తర్వాతే ఫోన్ తీసుకెళతాను అన్నాడు. వస్తువులు కొన్న వారికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఏదైనా తిన్న తర్వాత.. జేబులో డబ్బులు లేనపుడు యూపీఐ పేమెంట్స్ అవ్వకపోతే నరకం చూడాల్సి వస్తుంది. దాదాపు గంటకు పైగా యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

ఫ్రీగా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేయడం తెల్సా..

వాట్సాప్ స్టేటస్‌లో అదిరిపోయే ఫీచర్

మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి..భూకంపాన్ని ముందే తెలుసుకోండి

ఘిబ్లి స్టైల్ ఏఐ చిత్రాలు ఇలా క్రియేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్..

17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్స్ నిషేధం.. వీటిలో ఏవేవి ఉన్నాయంటే..
