Share News

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

ABN , Publish Date - Mar 15 , 2025 | 09:37 AM

మీరు రూ. 15 వేల లోపు మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే 5G సపోర్ట్‌తోపాటు, స్టైలిష్ లుక్ సహా అనేక ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..
Samsung Galaxy F16 5G

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ మళ్లీ కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే బడ్జెట్ విభాగంలో అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ, Samsung Galaxy F16 5G కొత్త ఫోన్‎ను భారతదేశంలో రిలీజ్ చేసింది. దీనికి ఆరు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, శక్తివంతమైన ప్రాసెసర్, స్టన్నింగ్ డిస్‌ప్లే సహా అనేక పీచర్లు ఉన్నాయి. బడ్జెట్‌ ధరల్లో 5G ఫోన్ కావాలనుకుంటే, ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

డిస్‌ప్లే & రిప్పుల్ గ్లో డిజైన్

Galaxy F16 5Gలో 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. దీని వల్ల స్క్రోలింగ్ సాఫ్ట్‌గా ఉంటుంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ అనుభవం మరింత ఈజీ అవుతుంది. వెనుక భాగంలో ఉన్న Ripple Glow ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది.


శక్తివంతమైన ప్రాసెసర్ & బ్యాటరీ

Samsung Galaxy F16 5G MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ చిప్‌సెట్ వల్ల దైనందిన పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ అన్ని లాగ్‌ లేకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. PUBG, BGMI, COD వంటి గేమ్స్‌ ఆడే వాళ్లకు ఇది బడ్జెట్ గేమింగ్ ఫోన్ లాగా ఉంటుంది. 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మిమ్మల్ని ఎక్కువ సమయం వాడుకునేలా చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 1.5 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది.


కెమెరా సెటప్

ఫొటోలు, వీడియోలు తీసుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి Galaxy F16 5G ట్రిపుల్ కెమెరా సెటప్ అదిరిపోయేలా ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా అధిక క్వాలిటీ షాట్స్ కోసం, 5MP అల్ట్రా వైడ్ లెన్స్ ఎక్కువ యాంగిల్ క్యాప్చర్ చేయడానికి, 2MP మాక్రో లెన్స్ క్లోజప్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడతాయి. 13MP సెల్ఫీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్పష్టమైన & ఫీచర్ రిచ్ ఇమేజెస్‎ను అందిస్తుంది.


బిగ్గెస్ట్ హైలైట్

శాంసంగ్ ఆరు సంవత్సరాల Android OS అప్‌డేట్‌లు & భద్రతా ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇస్తోంది. అంటే 2024లో కొనుగోలు చేసిన ఈ ఫోన్ 2030 వరకు సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.

Galaxy F16 5G: ధర, వేరియంట్లు

Samsung Galaxy F16 5G మూడు ర్యామ్ & స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తోంది

  • 4GB + 128GB – రూ. 12,499

  • 6GB + 128GB – రూ. 13,999

  • 8GB + 128GB – రూ. 15,499

మూడింటిలో ఏదైనా మీ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. బ్లింగ్ బ్లాక్, వైబింగ్ బ్లూ, గ్లామ్ గ్రీన్ అనే మూడు ట్రెండీ రంగులలో ఈ ఫోన్ లభిస్తోంది.

Galaxy F16 5G ఎక్కడ కొనుగోలు చేయాలి?

Samsung అధికారిక వెబ్‌సైట్, Flipkart, అమెజాన్ లేదా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..

Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 15 , 2025 | 09:40 AM