సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:47 PM
సావిత్రిబాయి పూలేను ప్రతీ ఒ క్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : సావిత్రిబాయి పూలేను ప్రతీ ఒ క్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. పూలే జయంతిని రాష్ట్ర ప్రభు త్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరు పుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో సా విత్రీబాయి పూలే 194వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు స్థానిక శాసన సభ్యుడు తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇంట్లో ఒక మహిళా విద్యావంతురాలు ఉంటే కు టుంబం మొత్తాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దు తారని తెలిపారు. అనంతరం ప్రతీ మండలం నుంచి ఒకరి చొప్పున 15 మంది మహిళా ఉ పాధ్యాయులను కలెక్టర్, శాసన సభ్యులు సన్మా నించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జిల్లా విద్యాశాఖ అఽ దికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, మార్కెట్ యా ర్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ సు జాత, దిశ కమిటీ సభ్యులు శంకర్ నాయక్, కౌ న్సిలర్లు పాల్గొన్నారు.