GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:15 PM
తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులపై ఎక్కువ దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు మరో సారి నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO ) పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపీఓగా నామకరణం చేసింది. మొత్తం 10,924 పోస్టులను మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవడానికి ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మందికి ఏకంగా 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనుంది. ఈ పథకం ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువత లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో లబ్దిదారుడికి 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. తీసుకునే లోన్ అమౌంట్ బట్టి రాయితీ 60 నుంచి 80 శాతం వరకు వస్తుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీనుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలు మంజూరు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
MCD Elections: ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం