Tummala: 11 వేల ఎకరాల్లో నష్టం
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:07 AM
ఇటీవల కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదిక వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

అధికారులు నివేదికను పంపాలి
రుణమాఫీపై విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎ్‌సకు లేదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదిక వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. గ్రామాల వారీగా సర్వేచేసి నివేదికలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
రైతులు కూడా అధికారులకు సహకరించాలని, వాస్తవ సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ పథకాన్ని అస్తవ్యస్తంగా అమలుచేసి, రెండు పర్యాయాలు చేతులెత్తేసిన బీఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కులేదని మంత్రి తుమ్మల అన్నారు. రుణమాఫీ-2024 ప థకాన్ని పక్కాగా అమలు చేసి ఇతర రాష్ట్రాలకు దిక్సూచిలా నిలిస్తే.. అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.