Home » Thummala Nageswara Rao
వరి కొయ్యలను తగలబెట్టొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అలా తగలబెడితే కలిగే అనర్థాలపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ధాన్యం సేకరణకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న పౌరసరఫరాలశాఖతో మార్కెటింగ్‌శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
యాసంగి సీజన్ నుంచి రైతులకు అవసరమైన ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
రాష్ట్రంలో వరికోతలు ఊపందుకున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, అందుకు తగ్గట్టు కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి వినతిపత్రం అందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహజ, సేంద్రియ వ్యవసాయానికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)’ ఏర్పాటుకు రూ.10 కోట్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది.